ఇంటికి పిలిచి మరదలిని హత్య చేసిన బావ.. కీలక విషయాలు వెల్లడి.. ఆ బంధమే కారణం..!

0 0

అక్క ఇంటికి వెళ్లిన యువతి.. ఇంట్లో శవమై కనిపించిన ఘటన కేరళలోని అలప్పుజాలో తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ యువతిది హత్యేనని పోలీసులు తాజాగా నిర్దారించారు. యువతినిను చంపినట్టుగా ఆమె అక్క భర్త పోలీసులకు వెల్లడించారు. అంతేకాకుడా పలు షాకింగ్ అంశాలను తెలిపాడు. వివరాలు..కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో నివాసం ఉంటున్న ఉల్లాస్, సువర్ణల కుమార్తె.. హరికృష్ణకు(25) పెళ్లి కాలేదు. ఆమె ప్రస్తుతం వందనమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తాత్కాలిక నర్సుగా పనిచేస్తోంది. ఆమె అక్క ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.

శుక్రవారం నైట్ డ్యూటీ ఉండటంతో హరికృష్ణ అక్క విధులకు వెళ్లింది. అయితే అదే సమయంలో హరికృష్ణ అక్క భర్త రతీష్ ఆమె ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. పిల్లలను చూసుకోవడానికి తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా రతీష్.. హరికృష్ణను కోరినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే హరికృష్ణ.. బావ రతీష్‌‌తో కలిసి అతడి ఇంటికి వెళ్లింది. అయితే తెల్లారేసరికి ఆమె ఇంట్లో శవమై కనిపించింది. అప్పటి నుంచి రతీష్.. పరారీలో ఉన్నాడు. అయితే హరికృష్ణ మృతికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రతీష్‌ను అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని విచారించగా.. రతీష్ కీలక విషయాలు వెల్లడించాడు. ‘నాకు హరికృష్ణతో సంబంధం ఉంది. అయితే ఇటీవల ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందని.. వారిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో నాకు, హరికృష్ణకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో.. ఆమెపై దాడి చేశాను. దీంతో ఆమె మరణించింది’ రతీష్ అని తెలిపాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents