బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌

0 1

Also Read :

హైదరాబాద్:మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఈనెల ఆగస్టు 8న బీఎస్పీలోకి చేరనున్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ రాజకీయ ప్రస్థానం అనేక పుకార్లు షికార్లు చేశాయి. మొదట టీఆర్‌ఎస్‌లో చేరి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే వీఆర్‌ఎస్‌ ప్రకటించిన ప్రవీణ్‌కుమార్‌, ఆ పార్టీలో చేరుతారని ఊహించటం కష్టమని ప్రచారం జరిగింది. ఇక ప్రవీణ్‌కుమార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకమైనందున.. బీజేపీలోనూ చేరే అవకాశం లేదు. ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ బీఎస్పీ బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents