కాంగ్రెస్, బీజేపీలు దళితులను ఓట్ల కోసమే వాడుకున్నారు: బాల్క సుమన్

0 0

కాంగ్రెస్, బీజేపీలు దళితులను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు దళితులకు వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కారణంగానే ఇన్నాళ్లూ అన్ని రంగాల్లో దళితులు వెనుక పడ్డారన్నారు.

వరంగల్ అర్బన్ కమలాపూర్ మండలం గునుపర్తి లో దళిత బంధుపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రవీందర్ రావు, నిమ్మగడ్డ వెంకన్నలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.

దేశంలో దళితుల బాగు కోరే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.. ఏకైక పార్టీ తెరాస పార్టీ. దళితులంతా సీఎం కేసీఆర్ వైపే ఉండాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. హుజురాబాద్ అభివృద్ధి లో వెనుకబడటానికి ఈటల రాజేందర్ కారణం. హుజురాబాద్ 4వేల ఇండ్లు మంజూరీ అయినా ఈటెల రాజేందర్ నిర్లక్ష్యం వల్లే ఇంకా నిర్మించలేదని విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents