వాట్సాప్ డెస్క్‌టాప్‌ యాప్ బీటా వెర్షన్ లాంచ్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి

0 2

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. టెలిగ్రాం,సిగ్నల్ లాంటి ప్రత్యర్థి యాప్స్‌తో పోటీ ఎక్కువ అవుతోన్న తరుణంలో యూజర్లు చేజారిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తోంది. ఫేస్‌బుక్ అధీనంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే మల్టీ డివైజ్ సపోర్ట్, వాట్సాప్ వెబ్ లాంటి ఉపయోగకరమైన ఫీచర్లను జోడించి ముందుకు దూసుకెళ్తోంది. త్వరలో వాట్సాప్ నుంచి డెస్క్‌టాప్‌ యాప్ సైతం రానుంది. తాజా బీటా వెర్షన్‌లో దీన్ని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ ఈ బీటా యాప్‌ను టెస్ట్ చేస్తునట్లు నివేదికలు చెబుతున్నాయి.

వినియోగదారులు వాట్సాప్ డెస్క్‌టాప్‌ యాప్ బీటా వెర్షన్‌ను టెస్ట్ చేయవచ్చని వాట్సాప్‌ అప్‌డేట్లను కస్టమర్లకు తెలియజేసే WABetaInfo తెలిపింది. విడుదలకు ముందే ఈ బీటా యాప్ ద్వారా కొత్త ఫీచర్లను రెగ్యులర్ వాట్సాప్ వినియోగదారులందరూ పరీక్షించవచ్చని స్పష్టం చేసింది. వాట్సాప్ డెస్క్‌టాప్‌ బీటా యాప్ ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది.

బీటా వెర్షన్‌ 2.2133.1 వాట్సాప్ డెస్క్‌టాప్‌ యాప్‌లో ఉపయోగకమైన ఫీచర్లను సంస్థ పరీక్షిస్తోంది. సెండ్ చేయడానికంటే ముందే మీరు రికార్డ్ చేసిన వాయిస్ నోట్‌ను వినే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రెండింటిలోనూ పనిచేస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు వాయిస్ నోట్స్ కోసం సరికొత్త వేవ్ ఫార్మ్ డిజైన్‌కు కూడా యాక్సెస్ పొందుతారు.

* వాట్సాప్ డెస్క్‌టాప్‌ బీటా వెర్షన్ కోసం ఎలా సైన్ అప్ అవ్వాలి?
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో పోలిస్తే.. వాట్సాప్ డెస్క్‌టాప్‌ బీటా వెర్షన్‌లో సైన్ అప్ అవ్వడం సులభం. WABetaInfo రిపోర్టులో అందించిన లింక్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, బీటా ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయవచ్చు. ఒక్కసారి లేటెస్ట్ బీటా వెర్షన్‌ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత, భవిష్యత్తులో వచ్చే అప్డేట్లన్నీ ఆటోమేటిక్‌గా ఇందులో అప్‌ డేట్ అవుతాయి.ఇందుటో గుర్తించిన బగ్స్‌ను యూజర్లు వాట్సాప్‌కు నివేదించవచ్చు. వాటన్నింటినీ సరిచేసిన తరువాత వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents