కరీంనగర్ లో భూప్రకంపనలు..

0 3

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్‌ రోడ్‌, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్‌, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents