బీజేపీ మహిళా మోర్చా నిరసన ప్రదర్శన

0 9

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఉదయం కరీంనగర్‌లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై తగ్గించిన వ్యాట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలంటు బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసన చేపట్టారు.

బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని శాంతియుతంగా నిరసనలు చేపడితే, తెలంగాణ పోలీసులు అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వ తొత్తుగా పనిచేస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ, ప్రజల నడ్డివిరిచే విధంగా పెట్రోల్, డీజిల్ పై అధిక ధరలు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించాలని, లేనియెడల బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని, వెంటనే ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పరి జయశ్రీ, మామిడి చైతన్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents