సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు కోసం వారి అభిమాని పాదయాత్ర
కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున సర్దార్ రవీందర్ సింగ్ గారు విజయం సాధించాలని నగరంలోని కాపువాడకు చెందిన వారి అభిమాని అయిన కొల నాగిన్ కుమార్ అనే యువకుడు ఈరోజు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారిని మరియు కొండగట్టు అంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని సర్దార్ రవీందర్ సింగ్ అన్నగారు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అఖండ విజయం సాధించాలి అని వారు విజయం సాధించిన తరువాత కరీంనగర్ పాత బజార్ చిన్న హనుమాన్ దేవాలయం నుండి కొండగట్టు అంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వచ్చి నాయోక్క మొక్కులు చెల్లించుకుంటానని స్వామి వారిని వేడుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కోల నాగిన్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ రవీందర్ సింగ్ గారు తెలంగాణ ఉద్యమకారుడిగా వారు అనేక పోరాటాలు చేసినారు అదేవిధంగా నగర మేయర్ గా పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, రూపాయికే అంతక్రియలు, పదో తరగతి చదివే పేద ప్రజల కోసం సరస్వతి ప్రసాదం ఇలా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు అలాంటి మంచి నాయకుడు ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రజల కోసం మరింత ప్రజాసేవ సేవ చేసే అవకాశం ఉంటుందని అందుకే వారి విజయం కోసం ఈరోజు కొండగట్టు వరకు పాదయాత్ర వస్తానని వేడుకోవడం జరిగిందని వారు అన్నారు.