ప్చ్.. మళ్లీ ఓడిన సింధు! రజతంతో సరిపెట్టిన తెలుగు తేజం!

0 24

BWF World Tour Finals: ప్చ్.. మళ్లీ ఓడిన సింధు! రజతంతో సరిపెట్టిన తెలుగు తేజం!

భారత స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మళ్లీ నిరాశపరిచింది. బీడబ్ల్యూ వరల్డ్​ టూర్ ఫైనల్స్​ తుదిపోరులో ఓడిపోయింది.​ ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకుంది.

Also Read :

మద్యం తాగించి బాలికపై అత్యాచారం

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 16-21, 12-21తేడాతో ప్రపంచ ఆరో ర్యాంకర్​ సియాంగ్​ చేతిలో ఓడిపోయింది. బీడబ్ల్యూ వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో ఇప్పటివరకు మూడుసార్లు తుదిపోరుకు అర్హత సాధించిన సింధు.. చివరిసారిగా 2018లో సింధు టైటిల్​ను సొంతం చేసుకుంది.

బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్ ఫైనల్స్​కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్​లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. ఈ టోర్నీ సెమీస్‌లో నెగ్గి ఫైనల్ చేరిన సింధు.. టైటిల్ ఫైట్‌లో మాత్రం నిరాశపరిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఈ టోక్యో బ్రాంజ్ మెడలిస్ట్ 21-15, 15-21, 21-19 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగూచి (జపాన్‌)పై పోరాడి గెలిచింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents