ఇంట్లోకి పాములు దురాయని.. ఇంటికే నిప్పుపెట్టాడు

0 8

Image

ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగబెట్టిన సామెత తెలుగులో చాలా ఫేమస్. అయితే ఇటువంటి నిజమైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కానీ అక్కడ ఇంట్లో ఉంది ఎలుకలు కాదు పాములు. పాములను తరిమే ప్రయత్నంలో ఇంట్లో పొగపెట్టాడో వ్యక్తి.. అది కాస్త మండే వస్తువులకు అంటుకోవడంతో ఇల్లు మొత్తం కాలిబూడిదైంది. అమెరికాలోని మేరీలాండ్‌లోని మాంట్‌గోమెరీలో ఈ సంఘటన జరగ్గా ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Image

మాంట్‌గోమెరీలోని ఓ ఇంట్లోకి పాములు చొరబడ్డాయి.. వాటిని గమనించిన ఇంటి యజమాని బయటకు పంపే ప్రయత్నం చేశాడు. అయితే అవి కనిపించకుండా లోపలికి వెళ్లడంతో వాటిని బయటకు రప్పించేందుకు పొగపెట్టాడు.. ఆ పొగ కాస్తా ఇల్లు మొత్తం కమ్మేసింది. దీంతో అక్కడి నుంచి బయటకు వచ్చాడు సదరు వ్యక్తి. ఇదే సమయంలో మంటలు చెలరేగి ఇంట్లోని మండే వస్తువులకు అంటుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంటి యజమాని తేరుకునే లోపే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వచ్చేలోపే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

Image

ఫైర్ సిబ్బందిలోని ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇల్లు కాలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై ఇంటి యజమాని మాట్లాడుతూ.. 10 లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు వివరించాడు. ఇంట్లోని అన్ని వస్తువులు కాలిపోయాయని తెలిపాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents