సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

0 15

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. అయితే గత రెండు రోజులుగా గంట ఎపిసోడ్‏లో సగానికి పైగా.. షణ్ముఖ్, సిరి ముచ్చట్లు, హగ్గులు మాత్రమే ప్రసారం అవుతుంటాయి.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ పాత్రలలో నటించాలని సూచించారు బిగ్ బాస్. మానస్.. పవన్ కళ్యాణ్, సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, షణ్ముఖ్.. సూర్య, కాజల్.. అతిలోక సుందరి శ్రీదేవిని చేశారు. ఇక సిరిని జెనిలీయాగా మార్చేశారు. ఒక్కో క్యారెక్టర్‏కు తగిన పాటలు వచ్చినప్పుడు వారు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే మొదట.. సిరి డ్యాన్స్ చేస్తుండగా.. సన్నీ ఆమెతో జత కలిశాడు.. దీంతో షణ్ముఖ్ అలిగిపోయాడు.. ఆ తర్వాత సిరి వచ్చి షణ్ముఖ్‎ను డ్యాన్స్ చేయమని అడగ్గా.. నాకు కొరియోగ్రఫీ రాదు అంటే.. నాకు మాత్రం వచ్చేంటి అని సిరి అనగానే కోపంగా చూశాడు షణ్ముఖ్. ఇక ఆ తర్వాత.. గబ్బర్ సింగ్ పాటకు మానస్ స్టెప్పులేశాడు.

ఇక తర్వాత… శ్రీరామ్, కాజల్, మానస్ డ్యాన్స్ చేస్తుంటే.. షణ్ముఖ్, సిరి ముచ్చట్లు పెట్టుకున్నారు. నీకు దూరంగా ఉండలేకపోతున్నా.. ట్రిప్ కాకుండా ఉండలేకపోతున్నా అని షణ్ముఖ్ అనగా.. నాకు దూరంగా ఉండు మరి ఎవరు వద్దన్నారు..నేను ట్రై చేస్తున్నా.. కానీ ట్రిప్ అయిపోతున్నా అంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ తర్వాత సింహ పాటకు డ్యాన్స్ చేయాలని సన్నీ.. సిరిని పిలవగా.. షణ్ముఖ్ చూపులకు భయపడి అక్కడే ఆగిపోయింది సిరి. ఇక డ్యాన్స్ ల అనంతరం స్కిట్ గురించి సిరి, సన్నీ, కాజల్ మాట్లాడుకుంటూ ఉండగా.. షణ్ముఖ్ ను పిలుస్తారు. దీంతో నాకు స్కిట్ రాదు అంటూ వెళ్లిపోతాడు షణ్ముఖ్. అతని వెనకాలే సిరి వెళ్లి.. నాతో నీకు ఏమానా ప్రాబ్లమ్ ఉందా.. మీ చేసుకోండి అంటున్నావ్ అని సిరి అడగ్గా.. మీరంతా ఒకటి.. నాతో ఉంటే ఫన్ ఉండదు.. వాళ్ల దగ్గరు వెళ్లు అంటూ చిరాకు పడతాడు షణ్ముఖ్. దీంతో బాత్ రూంలోకి పర్ఫామెన్స్ స్టార్ట్ చేస్తుంది సిరి. ఆ వెంటనే బాత్ రూం వద్దకు వెళ్లి తప్పు నాదే అంటాడు షణ్ముఖ్.

దీంతో బయటకు వచ్చిన తర్వాత మళ్లీ షణ్ముఖ్‏ను హగ్ చేసుకోవడంతో కూల్ అయిపోతాడు షన్నూ. నువ్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా.. తిరిగి ఒక్క మాట అనడం లేదు. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నా.. టాస్కుల విషయంలో ఇలా చేయకు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన ఫ్రెండ్ షిప్ కి వాల్యూ ఇస్తా.. నిన్ను నేను కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అంటూ మళ్లీ హగ్గులు స్టార్ట్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents