బిగ్ బాస్ హౌస్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ అవుట్..

0 16

కాంట్రవర్సీ క్వీన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అందరూ చెప్పే పేరు ఆర్జే కాజల్.

కేవలం ఇది ప్రేక్షకుల అభిప్రాయం కాదు.. ఇంటి సభ్యులు అభిప్రాయం కూడా. నూటికి 90 శాతం మందికి ఈ అమ్మాయి నచ్చదు అని గత వారం ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్ ఓపెన్‌గా చెప్పింది. చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఇంటి సభ్యులు కూడా చాలాసార్లు చెప్పారు. మరో వైపు షణ్ముఖ్ జస్వంత్ అయితే నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అని రెండు మూడు సార్లు చెప్పాడు. అదే కారణంతో కాజల్‌ను నామినేట్ కూడా చేశాడు. అయితే తన ఆటిట్యూడ్‌తో 14 వారాల పాటు ఇంట్లో ఉంది కాజల్. టాప్ 6 కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచింది. చాలా వారాలు డేంజర్ జోన్‌లో ఉన్నా కూడా ఇతర కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోవడంతో బతికిపోయింది. అయితే ఈ సారి ఆ ఛాన్స్ లేదు. కాజల్ బయటకు వచ్చేసింది.

నిజానికి పదో వారం ఆర్జే కాజల్‌ బయటికి వెళ్లాలి.. కానీ ఆ వారం జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు. దాంతో కాజల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. 14వ వారం ఈమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఓటింగ్ పరంగా చూసుకుంటే మిగిలిన ఐదుగురు సభ్యులతో కాజల్ పోటీ పడలేకపోయింది. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలవాలని కలలుగన్న ఈమె.. అది తీరకుండానే బయటకు వచ్చేసింది. ఈవారం కాజల్ ఎక్కువగా డబుల్ గేమ్ ఆడిందనే విమర్శలు బాగా వచ్చాయి. ముఖ్యంగా సన్నీ, మానస్ దగ్గర కేవలం ఓటింగ్ కోసమే ఫ్రెండ్‌షిప్‌ చేసినట్లు ఈమెపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పైగా ముగ్గురు ఈసారి నామినేషన్‌లో ఉండటంతో.. కాజల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. మరి బయటికి వచ్చిన తర్వాత ఈమె తన కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents