క‌వ‌ల‌ల‌కు జ‌న్మినిచ్చిన లోబో భార్య‌.. చిరంజీవి ఆశీర్వ‌దించాడంటూ పోస్ట్

0 12

ఒక‌ప్పుడు వీజేగా ప‌లు టీవీ షోల‌లో క‌నిపించి సంద‌డి చేసిన లోబో బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొని అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో ఆయ‌న చాలా ఫేమ‌స్. అయితే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక లోబో త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తూ అభిమానులని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. ఇటీవ‌ల త‌న‌కు మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేసిన‌ట్టు తెలియ‌జేశాడు.

చిరంజీవి పిలిచి మరీ తన సినిమాలో ఆఫర్‌ ఇచ్చారని లోబో వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. నా కల నిజమైంది. చిరంజీవి సార్ సినిమాలో ఆఫర్‌ వచ్చింది అని వెల్లడించారు. ఇటీవల ఓ షోలో కూడా లోబో పాల్గొని ఇదే విషయాన్ని తెలిపారు. సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర, మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్టే అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక తాజాగా లోబో తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ కాగా, ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.కాగా, బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా లోబో తన భార్య గర్భవతి అని, ఈ సమయంలో తనకు తోడుగా లేనంటూ ఎమోషనల్‌ అయిన విషయం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents