ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే. డా. సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి ఉచితంగా కండ్లద్దాలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు కండ్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో డా. విజయ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ఏఎంసీ డైరెక్టర్లు బండారి విజయ్, తిరుపతి గౌడ్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరీఫ్, దవాకాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.