10 రూపాయల కూడా టిప్ ఇవ్వలేదని .. పొట్టు.. పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్

0 13

టిప్ సర్వీసును బట్టి కస్టమర్ ఇవ్వాలి. అంతేకానీ.. డిమాండ్ చేయకూడదు. టిప్.. ఇవ్వలేదని గలాటా సృష్టించకూడదు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర హోటల్‌లో ఇందుకు భిన్నమైన సీన్ కనిపించింది.

పది రూపాయల టిప్ లొల్లి.. కొట్టుకునే దాకా వెళ్లింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర హోటల్‌లో బిర్యానీ తినేందుకు కొందరు యువకులు వెళ్లారు. తిన్న అనంతరం.. బిల్లు చెల్లించిన తర్వాత టిప్పు ఇవ్వమని వెయిటర్‌ యువకులను అడిగాడు. మాకు సర్వీస్ నచ్చితే ఇస్తాం.. డిమాండ్ చేయడం ఏంటని యువకులు ప్రశ్నించారు. ఇక్కడ మాటమాట పెరిగి యువకులపై వెయిటర్‌ దాడికి దిగాడు. అయితే వెయిటర్‌ను వారించాల్సిన హోటల్‌ సిబ్బంది కూడా యువకులపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. గతంలో కూడా ఈ హోటల్‌పై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా హైదరాబాద్‌లో ఈ కల్చర్ బాగా పెరగిపోయింది. గణేశ్ చందాల దగ్గర్నుంచి, ఇదిగో ఇలా హోటల్‌లో టిప్ వరకు డిమాండ్ చేసేస్తున్నారు. ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల దాడులకు సైతం దిగుతున్నారు. పోలీస్ బాస్‌లు కాస్త ఫోకస్ పెడితే కానీ ఇలాంటి అతి గాళ్ల తిక్క కుదరదు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents