ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్.. మరో తొమ్మిది మంది పరిస్థితి..

0 41

ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

కామారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దకొడపగల్ మండలం జగన్నాథ్‌పల్లి గేటు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగన్నాథపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిచి ఉన్నలారీని.. క్వాలిస్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కారు బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా.. అతి వేగంగా కారు నడపడంతో అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం అతివేగమే అని స్థానికులు చెబుతున్నారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు.

ఇదిలా ఉండగా.. శనివారం తల్లవారు జామున హైదరాబాద్ శివారలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. అందులో మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని HCU రోడ్‌లో ఈ దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డిసెంబర్ 18 తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ గాయపడిన వ్యక్తి పేరు సిద్ధు అని తెలుస్తుంది. అతడు కూడా జూనియర్ ఆర్టిస్టే. పైగా ఆయనతో పాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మానస(22), మానస(21) అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళతో పాటు డ్రైవర్ అబ్దులా కూడా దుర్మరణం పాలయ్యాడు.

ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన సిద్దు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents