CJI : నేడు రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సీజేఐ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితోపాటు, రామప్ప చెరువును జస్టిస్ రమణ దంపతులు సందర్శించనున్నారు. ఇవాళ రాత్రికి హనుమండలోని ఎన్ఐటీ అతిథిగృహంలో బస చేస్తారు. రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఆదివారం ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య హనుమకొండలోని కోర్టుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. రూ.22 కోట్ల వ్యయంతో పది కోర్టుల భవనం నిర్మించారు. అదేరోజు సాయంత్రం షామీర్పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్తారు