అల్ఫోర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాలు
క్రీడల ద్వారా విద్యార్థులకు ఎన్నో లాభాలు జరుగుతాయని, పోటీ తత్వాన్ని రెట్టింపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని గురువారం ఆల్ఫోర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ పట్టణం వావిలాలపల్లిలోని ఆల్పోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ లో విద్యార్ధులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాలు, మొదటి స్థానం కైవసం చేసుకున్నందుకు గాను ఏర్పాటు చేసిన అభినందన సభకు కరీంనగర్ మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈనెల 17 నుండి 19వ తేది వరకు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 3వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ 2021లో పాఠశాలలకు చెందిన కే పావని, 9వ తరగతి కటా, కుమిటే విభాగంలో రెండు బంగారు పతకాలతో పాటు మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఇదే పాఠశాలకు చెందిన కె అనుజ, 6 వ తరగతి అండర్ 12 కటా, కుమెటే విభాగంలో బంగారు పతకంతోపాటు కాంస్య పతకాన్ని గెలుచుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.