ఒమిక్రాన్ నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్
ఒమిక్రాన్ వేరియంట్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య పనులు ముమ్మరం చేసి కోవిడ్ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు.