ఎంపీ బండి సంజయ్ పై మేయర్ ఫైర్
కరీంనగర్లోని స్మార్ట్ సిటీ పనులు నత్తనడక నడుస్తున్నాయి, అన్న ఎం పీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మేయర్ సునీల్ రావు. రాజకీయ భిక్ష పెట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థ పై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అసత్య ప్రచారాలు చేసి స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ గతం గుర్తు చేసుకోవాలని అన్నారు.
కరీంనగర్ లో 300 వందల కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తుంటే ఎం పీ కి కనబడకుండా పోవడం దురదృష్టకరం. ఎంపీ కరీంనగర్ లో లేకపోవడంతో అభివృద్ధి పనులను చూడలేకపోతున్నారు. కరీంనగర్ సుందరీకరణ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తే ఊరుకునే ప్రసక్తి లేదని బండి సంజయ్ కుమార్ ను హెచ్చరించిన మేయర్ సునీల్ రావు.