సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడం కెసిఆర్ దేశ భక్తికి నిదర్శనం
బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్
పాకిస్తాన్ దేశ వ్యక్తిని వివాహం చేసుకున్న క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడం కెసిఆర్ దేశభక్తి కినిదర్శనం అని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ఎద్దేవా చేశారు . ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ దేశ నివాసిని వివాహమాడి, నిత్యం పాకిస్తాన్ కు రాకపోకలు సాగించి , పాకిస్తాన్ దేశాన్ని పొగిడే క్రీడాకారిణి సానియా మీర్జా కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సానియా మీర్జాకు సర్వ రాజ్య భోగాలు అనుభవించే విధంగా కెసిఆర్ ప్రభుత్వం పారితోషకాలు అందించడం దారుణమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అర్హత కలిగిన క్రీడాకారులు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అనేక మంది ఉన్నా కెసిఆర్ ప్రభుత్వం సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంతో ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ దేశ నివాసిని సానియా మీర్జా వివాహమాడి, దేశాన్ని కించపరిచే విధంగా చేసిందని, దీంతో సానియా మీర్జా దేశభక్తి కూడా ప్రజలందరికీ అర్థమైంది అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి సోయి లేదని, పాకిస్తాన్ దేశ వ్యక్తిని వివాహమాడి, అక్కడి దేశ కోడలిగా కొనసాగుతున్న సానియా మీర్జాను ఇంకా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడం దేశాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే అని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా కొనసాగే నైతిక హక్కులేదని , కెసిఆర్ ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో పునరాలోచన చేసి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు