కనీస మర్యాద, సంస్కారం లేకుండా.. మల్లన్న పోస్ట్ పై మండిపాటు

0 5

మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీ నేత తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌పై బీఎస్పీ కన్వీనర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోమారు తీవ్రంగా ధ్వజమెత్తారు.

కనీస మర్యాద, సంస్కారం లేకుండా.. మల్లన్న పోస్ట్ పై మండిపాటు

కనీస మర్యాద, సంస్కారం లేకుండా ఒపీనియన్ పోల్ అంటూ అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా.. తమ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొవాలి గానీ వారి కుటుంబ సభ్యుల శరీర తీరును కాదు. ఇలాంటి విషయాలపై మనమంతా కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి ఉంది’ అని ట్వీటర్ వేదికగా తెలిపారు.

మరోవైపు ఈ ఉదంతంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా స్పందించారు.’పిల్లల్ని వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖలు చేయడాన్ని ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్‌ చేయడం వంటివి తీవ్రమైన విషయాలని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents