ఛాన్స్ అడిగితే రూమ్‌కు వస్తావా అని అడిగాడు.. టీమ్ లీడర్స్‌పై కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..

0 3

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు హరి కూడా ఇదే చెప్పాడు. ఈయన జబర్దస్త్ ప్రేక్షకులకు హరితగా బాగా పరిచయం.

 

భాస్కర్ సహా అందరి స్కిట్స్‌లో కూడా అమ్మాయి వేషాలు వేస్తుంటాడు హరి. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయిన ఈయన ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతున్నాడు హరి. జబర్దస్త్‌కు రాకముందే తన ఊళ్లో సెలబ్రిటీ అని.. లేడీ గెటప్స్‌లో చాలా స్కిట్స్ చేసానని చెప్పాడు.

 

ఆ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షో చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు ఈయన. ఇదిలా ఉంటే లేడీ గెటప్స్ వేయడం వల్ల తనకు చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పాడు హరి. ముఖ్యంగా తన కుటుంబంలో పెద్దక్క తనను హిజ్రాతో పోల్చిందని ఏడ్చేసాడు ఈయన. అంతేకాదు బయట కూడా వేధింపులు వస్తాయని చెప్పాడు హరి. కొందరు తనకు ఐ లవ్ యూ కూడా చెప్పారని.. దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదని చెప్పాడు హరి.

 

తాను కూడా అందరిలాగే అబ్బాయినే కదా.. అలాంటిది అబ్బాయిలే వచ్చి తనను ప్రేమిస్తున్నామని చెబుతుంటే నవ్వేస్తుంటానని చెప్పాడు. అంతేకాదు.. సెక్స్ కోసమే ప్రేమ నాటకం ఆడుతుంటారని.. తనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాడు హరి. వాళ్లకు ఎలా చెప్పాలో కూడా తనకు అర్థమయ్యేది కాదని చెప్తున్నాడు హరి.

 

ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసినపుడు ఇలాంటివి తప్పవంటున్నాడు హరి. తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి. ఇదిలా ఉంటే జబర్దస్త్‌కు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అడిగితే టీమ్ లీడర్స్ కూడా కొందరు రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే వాళ్లెవరో చెప్పనంటున్నాడు హరి.

 

జబర్దస్త్ నటులకు ఇలాంటి వేధింపులు ఇదే తొలిసారి కాదు. గతంలో అమ్మాయిగా మారిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్‌ను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

 

దానికి ముందు లేడీ గెటప్స్‌తో బాగా పాపులర్ అయిన శాంతి స్వరూప్‌తో పాటు వినోదినిని కూడా చాలా మంది వేధించారని ఇంటర్వ్యూలలో చెప్పారు. తామంతా కుటుంబాల కోసం కష్టపడుతున్నామని.. అలాంటిది తమ బాధ అర్థం చేసుకోకుండా ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు ఈ జబర్దస్త్ కమెడియన్లు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents