కరీంనగర్ లో అరుదైన శస్త్ర చికిత్స

మహిళా గర్భసంచిలోనుండి 7కిలోల కణితిని తొలగించిన డాక్టర్ శ్రీనివాస్

0 10

కరీంనగర్ లో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు . కరీంనగర్ లోని వాసుదేవ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో ఈరోజు నిర్వహించిన శస్త్ర చికిత్సలో మహిళా గర్భసంచిలోనుండి 7కిలోల కణితిని తొలగించినట్లు డా. శ్రీనివాస్ తెలియజేశారు.

బెజ్జంకికి చెందిన 50సంవత్సరాల మహిళా గతకొంత కాలంగా అనారోగ్యంతో పడుతుంది. తన చుట్టూ పక్కల వారి సూచనలతో, బంధువుల సలహాలతో కరీమ్నగర్లోని పలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని మందులు వాడుతుంది అయినప్పటికీ తన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మరోసారి హాస్పిటల్ లో చెకప్ చేయించుకుని ఉత్తమ వైద్యం కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ లోకి కూడా వెళ్ళివచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ తన ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడకపోగా ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కరీంనగర్ పట్టణంలోని వాసుదేవ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ కు రావడంతో, మహిళను పరిశీలించిన డా. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి మరిన్ని పరీక్షలు నిర్వహించగా గర్భ సంచిలో ఒక పెద్ద కణితి ఉన్నదని గుర్తించారు. అది ఇప్పటికే చాల పెద్దదిగా పెరిగిందని వెంటనే , శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించాలని చెప్పడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో డా. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి శస్త్ర చికిత్స చేసి 7కిలోల కణితిని బయటకు తీశారు.

శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగిస్తున్నదృశ్యం

ఈ విషయమై డా. శ్రీనివాస్ ను సంప్రదించగా అనారోగ్యంతో, తీవ్రమైన కడుపునొప్పితో మహిళా మా హాస్పిటల్ కే వచ్చింది. తాను ఇప్పటికే చాల హాస్పిటల్ ను సందర్శించింది, దానికి సంబందించిన రిపోర్టులను పరిశీలించగా ఎక్కడ కూడా తనకి సమస్య ఉన్నట్లు కనిపించలేదు, కానీ మాకు ఉన్న అనుమానంతో మరొక్క సారి మా సిబ్బందితో కలిసి పూర్తిగా స్కానింగ్ చేసి చూడగా తన గర్భ సంచిలో కణితి ఉన్నట్లు గుర్తించాము. వెంటనే శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తీసివేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు తెలియజేసి వారి అంగీకారంతో శస్త్ర చికిత్స నిర్వహించాము, కణితిని తొలగించి చూడగా అది 7కిలోల బరువు ఉంది. ఇంత బరువైన కణితిని పెట్టుకుని తాను చాలా భాదను భరించిందని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు చాల అరుదుగా జరుగుతాయని తెలియజేశారు. ప్రస్తుతం మహిళా పరిస్థితి బాగానే ఉందని. 4,5 రోజులలో కోలుకోగానే ఇంటికి పంపించేస్తామని తెలియజేశారు.

తొలగించిన కణితితో డా. శ్రీనివాస్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents