ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్‌ తూటాలకు ఎస్‌ఐ బలి..

భయాందోళనతో తనూ కాల్చుకున్న కానిస్టేబుల్‌

0 5

జిల్లాలోని వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెస్‌ వద్ద సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన ఎస్‌ఐ ఉమేశ్‌ చంద్రపై జవాన్‌ స్టీఫెన్‌ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్‌ తూటాలకు ఎస్‌ఐ బలి.. భయాందోళనతో తనూ కాల్చుకున్న కానిస్టేబుల్‌

తీవ్ర గాయాలతో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆందోళనకు గురైన స్టీఫెన్‌ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలవగా హుటాహుటిన అతన్ని ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతి చెందిన ఎస్సైది బిహార్‌ కాగా కానిస్టేబుల్‌ స్టీఫెన్‌ది కన్యాకుమారి.

కాగా, ఎస్‌ఐ ఉమేశ్‌ చంద్రకు, కానిస్టేబుల్‌ స్టీఫెన్‌కు వాగ్వివాదం చోటుచేసుకుంది. సెంట్రీ డ్యూటీ ఎప్పుడూ తనకే వేస్తావా అంటూ ఎస్సైతో స్టీఫెన్‌ గొడవ పడ్డాడు. ఈ గొడవ పెరిగి పెద్దది కావడంతో క్షణికావేశంలో ఎస్సై ఉమేశ్‌ చంద్రపై సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ స్టీఫెన్‌ కాల్పులు జరిపాడు. ఎస్సై ఛాతిలో రెండు బుల్లెట్లు, పొట్టలో ఒక బులెట్ మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents