ఇచ్చిన మాట తప్పని ముఖ్యమంత్రి కేసీఆర్

0 16

రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం నిమిత్తం రైతుల ఖాతాలలో నిధులు జమ చేసిన సందర్భంగా నేడు గోపాల్ పూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేసారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన మాట తప్పని ముఖ్యమంత్రి అని, కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, కేంద్రం కాలడ్డం పెట్టినా కూడా ప్రతీ రైతుకు రైతుబందు నిధులు అందజేస్తున్నారని అన్నారు.

వడ్లు కొనమని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. మిల్లర్లతో ఒప్పందాలు ఉన్నవాళ్లు వడ్లు వేయోచ్చునని తెలియజేశారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అహర్నిశలు తెరాస ప్రభుత్వం రైతులకోసం కృషి చేస్తుందని ముందటి గంగుల కమలాకర్ తెలియజేశారు. రైతుబందు నిధుల విడుదలపై ముఖ్యమంత్రికి కృతజ్ణతలు తెలియజేశారు.

May be an image of 5 people and people standing

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents