సుఖీభవ డైలాగ్ తో.. ఆర్టీసీ కీ క్రేజ్ తెస్తున్నా సజ్జనార్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుఖీభవ అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరి నోట్లో చూసినా… సుఖీభవ డైలాగే వస్తోంది. నల్లగుట్ట శరత్ అన్న అబ్బాయి టీ పౌడర్ యాడ్. ను రీ క్రియేట్ చేసి జోరుగా తీన్మార్ స్టెప్పులు వేయడం. అది కాస్త మీన్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇంకేముంది… ప్రస్తుతం ఆ డైలాగ్ ను తెలుగు రాష్ట్రాల్లో తెగ వాడేస్తున్నారు జనాలు.
అయితే తాజాగా సుఖీభవ డైలాగ్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా వాడేశారు. ఆ డైలాగ్ తో… తెలంగాణ ఆర్టీసీ కి క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు సజ్జనార్. “అయ్యయ్యో అధిక చార్జీలు వద్దమ్మా! తక్కువ ధరలో శుభప్రదమైన సుఖవంతమైన ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు తోనే సాధ్యం. యూపీఐ ద్వారా మీ పేమెంట్లు చెల్లించి టికెట్ పొందగలరు సుఖీభవ సుఖీభవ. బుకింగ్ కోసం https: //tsrtconline. in/oprs-web/ ను ఫాలో అవ్వండి ” అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. అంతే కాదు. ఈ ట్వీట్ కు సుఖీభవ వీడియో కూడా టాగ్ చేశారు సజ్జనార్.