#Anasuya : అనసూయ ఫ్యాన్స్ కి ఇది బంపర్ న్యూసే..!
న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ పుణ్యమా అని టాప్ యాంకర్ గా గుర్తింపు అందుకుంది. ఆ షోలో కామెడీ ఒక ఎతైతే ఆమె గ్లామర్ మరో ఎత్తు. పొట్టి బట్టలలో, హాట్ శారీలలో ఆమె ఇచ్చే అందాల విందు కోసమే షో చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ షోతో వచ్చిన ఫేమ్ తో ఈమె సినిమాలలో కూడా బిజీ అవుతుంది. ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో పాటు అప్పుడప్పుడు హీరోయిన్ రోల్స్ కూడా చేస్తుంది.