మానేరు డ్యామ్ లో ఫ్లోటింగ్ సోలార్ సర్వే
సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మానేర్ డ్యాంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం సర్వే చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి సోలార్ ఎనర్జీ జీఎం. డివి సూర్యనారాయణ రాజు, ఇంజనీర్లు ఎస్పీ శ్రీనివాస్ , నటరాజ్ ప్రసాద్ లు మర్యాదపూర్వకంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో కలిశారు.
ఈ సందర్భంగా మానేరు డ్యామ్ లో ఫ్లోటింగ్ సోలార్ సర్వే విధానము ఏర్పాట్ల గురించి పూర్తిగా వివరించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించడం కాకుండా ప్లాంటు ఏర్పాటుకు పనులను వేగవంతం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.