షీ టీమ్, సైబర్ నేరాలపై అవగాహన
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హాజరై మాట్లాడుతూ మహిళలు, యువతులు, విద్యార్థినులకు వేధింపుల నుంచి రక్షణ కల్పించడమే షీటీమ్ల ఉద్దేశమన్నారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, మెరుగైన సేవలందించేందుకు పోలీసులు ముందుంటారన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈకార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శీలం లక్ష్మణ్, శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్లు, పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ షీ టీమ్ ఇన్చార్జి, జూలపల్లి ఎస్ఐ వినిత, టైనింగ్ ఎస్ఐ రాజవర్ధన్, కస్తూర్బా గాంధీ ఎఫ్ఏఓ జిసిఓ రామారెడ్డి, షీ టీమ్ ఇన్చార్జీ, పిసి సుమలత, పాఠశాల ఎస్ఓ మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.