షణ్ముఖ్‌కి బ్రేకప్.. సోషల్ మీడియాలో దీప్తి సునైనా పోస్ట్.. షాక్‌లో అభిమానులు

0 8

షణ్ముఖ్, దీప్తి సునైనా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫేమస్ కపుల్. ఈ జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. ఇది డైరెక్ట్ గా వీళ్ళు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పారు. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి ఇండైరెక్ట్ గానే చెప్పారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోను నటించారు. అంతేకాక ఇద్దరూ కలసి ట్రిప్స్ కి కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

వీళ్ళ ఇద్దరి మధ్య గతంలో కొన్ని గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు దీప్తి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవల షణ్ముఖ్ బిగ్ బాస్ లో పాల్గొని వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా దీప్తి షణ్ముఖ్ కి బాగా సపోర్ట్ చేసింది. షన్ను కోసం బిగ్ బాస్ కి కూడా వెళ్లి తన ప్రేమని చూపించింది. షన్ను కూడా హౌస్ లో రోజు దీప్తి ని తలుచుకునేవాడు. మరి ఏమైందో తెలీదు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే విడిపోయారు.

ఈ విషయంపై దీప్తి సునైనా సోషల్ మీడియాలో…….. చాలా ఆలోచించి, మాట్లాడుకున్న తర్వాత షణ్ముఖ్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతో మేము విడిపోయి వ్యక్తిగతంగా జీవించాలనుకుంటున్నాం. ఇకపై ఎవరి దారిలో వాళ్ళు వెళ్దామని నిర్ణయించుకున్నాం. మేం ఇద్దరం కలిసి ఉన్న ఈ ఐదేళ్లలో చాలా హ్యాపీగా, ఎంతో అప్యాయంగా ఉన్నాం. కానీ మా మనసుల్లో ఉన్న రాక్షసులతో పోరాడటం చాలా కష్టం. మీరందరూ కోరుకున్నట్లే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్ అనేది సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదు. మా బ్రేకప్ చాలా కాలం కొనసాగుతూనే ఉంది. మా మధ్య మనస్పర్దలు వచ్చినప్పుడు మేము కలిసి ఉండటానికి చాలా ప్రయత్నించాం. మా మార్గాలు కూడా వేరువేరు. ఒకే చోట చిక్కుకుని ఉండకుండా ముందుకు సాగాలని మేము తెలుసుకున్నాం. ఇలాంటి టైంలో మా ప్రైవసీకి స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమకి, సపోర్ట్ కి ధన్యవాదాలు” అని పోస్ట్ పెట్టింది.

దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకాలం కలిసి ఉండి పెళ్లి చేసుకుంటారు అనుకున్న వీరిద్దరూ విడిపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వీరి అభిమానులు కొంతమంది మీరు విడిపోవద్దు అని కామెంట్స్ పెడుతుంటే, కొంతమంది దీప్తికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే షణ్ముఖ్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం విశేషం.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents