మేయర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

0 9

2022 నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని నగర మేయర్ యాదగిరి సునిల్ రావు అన్నారు. కరీంనగర్ లోని 33 వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది, చైతణ్య యూత్, పెద్దమ్మయూత్, జై భూమ్ యాత్ సభ్యులతో కలిసి మేయర్ సునిల్ రావు కేట్ కట్ చేసి. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు. నూతన సంవత్సరం సంధర్బంగా పలువురు యూత్ క్లబ్ సభ్యులు మేయర్ సునిల్ రావుకు పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి మేయర్ సునిల్ రావు కూడ నూతన సంవత్స శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు. ఈ సంధర్బంగా మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ.

మేయర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు.

2022 నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంతో పాటు, కరీంనగర్ నగర ప్రజల్లో కొత్త హుత్సాహాన్ని నింపాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది. దేశంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. పేద ప్రజలకు ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో నగరపాలక సంస్థ ద్వారా అభివృద్ది పనులు చేపట్టి కరీంనగర్ నగర ప్రజలకు కొత్త హంగులను చూపిస్తామన్నారు. గత రెండు సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న కరోనా వేరియంట్లను అధికమించి. వ్యాది పూర్తి స్థాయిలో నశించాలని కోరుకున్నారు. ప్రజలు కూడ వైరస్ బారిన పడకుండ చాలా జాగ్రత్తలు తీస్కొని వ్యాదిి నుండి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపు సిబ్బంది ప్రకాష్ రావు, శ్రీనివాస్, రాకేష్, రాజేష్, నరెంధర్, అంజన్న, పలు యూత్ క్లబ్ సభ్యులు కుంభం అనిల్, సంజీవ్, హామీద్, బాలు, ధన్ రాజ్ , పండగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents