20 మంది ఎమ్మెల్యేలకు, పదిమంది మంత్రులకు కరోనా..
ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం ఒక ప్రకటన చేశారంటే రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో ఇది చూస్తే అర్థం అవుతోంది. మహారాష్ట్రలో కరోణ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే శనివారం రోజు వరకు 50 శాతం ఎక్కువగా పెరిగాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు మరియు పదిమంది మంత్రులకు కరోణ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు తప్పనిసరిగా విధించేలా చర్యలు చేపట్టాలని పవార్ అన్నారు. అయితే ఎనిమిది వేలకు పైగా కేసులు పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు పవర్.