ఉద్యోగులకు సంఘీభావంగా నిరసన జాగరణ
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో ను వెంటనే సవరించాలని , అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని, సవరించిన జీఓ ప్రకారమే బదిలీలు, నియామకాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేస్తూ, ఉద్యోగులకు సంఘీభావంగా ఆదివారం ఎం. పి కార్యాలయం వద్ద నిరసన జాగరణ చేపడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
వాట్సప్, ఎస్ఎంఎస్ లతో పాటు వివిధ రకాలుగా ఉద్యోగస్తులకు బదిలీలకు సంబంధించి కన్ఫ్యూజ్ చేసే సమాచారం ప్రభుత్వం అందిస్తుందని, ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తూ మానసిక క్షోభకు గురి చేయడం, కెసిఆర్ ప్రభుత్వానికి భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను నిద్ర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని సరిదిద్దుకోవాలనే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్.
ఆదివారం జనవరి 2న కరీంనగర్ లో రాత్రి 9 గంటల నుండి సోమవారం జనవరి 3 ఉదయం 5 గంటల వరకు నిరసన జాగరణ( జాగారం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల , పట్టణ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, బిజెపి అనుబంధ విభాగ ప్రతినిధులందరూ ఇట్టి నిరసన జాగారంలో పాలుపంచుకోని, విజయవంతం చేయాలని ఆయన కోరారు.