సందడిగా మంత్రి గంగుల మీసేవా కార్యాలయం

0 13

పలు అసోసేయేషన్ల క్యాలెండర్లు… డైరీలను ఆవిష్కరించిన మంత్రి మంత్రిగారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సిఐలు, ఎస్సైలు, విద్యుత్ శాఖ అధికారులు ఆరెపల్లి మోహన్, తెరాస శ్రేణులు

కొత్త సంవత్సరం లో 2వ రోజు కూడా మంత్రి గంగుల కమలాకర్ దినచర్య బిజీబిజీగా కొనసాగింది. మంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు… కేవలం కరీంనగర్ నియోజకవర్గం నుండే కాకుండా… జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన మంత్రి గారి అభిమానులు… వివిధ శాఖల అధికారులతో సందడిగా కనిపించింది… నూతన సంవత్సరంలో సర్వజనులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. అభివృధ్ధి… సంక్షేమమే మా ప్రభుత్వ నినాదమని… ఆ దిశగా ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు.

కొత్త సంవత్సరం వేళ… కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ మీ సేవా కార్యాలయంలో సందడి కొనసాగుతుంది. వివిధ అసోసియేషన్ల క్యాలెండర్లు… డైరీల ఆవిష్కరణతో మంత్రిగారికి క్షణం తీరిక లేకుండా పోయింది… తొలుత కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన క్యాలెండర్ ను మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు… ఆలయ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు గంప రమేష్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పీచర కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 8వ డివిజన్ కు చెందిన మంత్రి గంగుల అభిమానులు… తెరాస శ్రేణులకు సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత… ఎస్టీటియుటిఎస్ కు సంబందించిన డెయిరీని… క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చివరకు ఐఏఎస్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నేటితరం కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఐఏఎస్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

స్టాప్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని… కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు సిఐలు, ఎస్సైలు మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకేలు అందించి… నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్… విద్యుత్ శాఖ అధికారులు… పలువురు తెరాస శ్రేణులు మంత్రి గారిని కలిసి… కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న జమ్మికుంట పట్టణ సిఐ శ్రీ రామచందర్ రావు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న జమ్మికుంట రూరల్ సిఐ జవ్వాజి సురేష్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ పట్టణ సిఐ శ్రీనివాస్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ హుజురాబాద్ రురల్ సిఐ ఎర్రల కిరణ్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents