మీసం పెంచుకున్నాడని కానిస్టేబుల్ సస్పెండ్..ఇది నా పరువు..తీసేదేలేదంటున్న రాణా

0 10

సినిమాల్లో పోలీస్ పాత్రలో నటించిన హీరోలు కోర మీసం పెంచుకుని భారీ భారీ డైలాగులు చెప్పి మీసం మెలేస్తే అభిమానులు చప్పట్లు మారుమోగిస్తారు. ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సినిమాల్లో పోలీసులు మీసాలు పెంచుకున్నా..జులపాల జట్టుతో స్టైల్ క్రియేట్ చేసినా అభిమానులకు పండుగే. కానీ నిజ జీవితంలో పోలీసులు అలా ఉంటే కుదరదు అంటున్నారు పోలీసు అధికారులు. అందుకే సినిమా హీరోలో మీనం పెంచుకున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

police Mustache : మీసం పెంచుకున్నాడని కానిస్టేబుల్ సస్పెండ్..ఇది నా పరువు..తీసేదేలేదంటున్న రాణా

Also Read :

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాకేశ్‌ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌ను (సినిమాలో హీరో సింహ సినిమాలో బాలకృష్ణ, యముడు సినిమాలో సూర్య లాగా ) మీసం పెంచుకున్నాడని సస్పెండ్ చేశారు. రాణా మెడ వరకు మీసాలు, జుత్తు పెంచుకున్నాడు. ఆ గెటప్ తోనే డ్యూటీకి వచ్చాడు. అది చూసిన ఉన్నతాధికారులు రాణాను హెయిర్ కట్ చేయించుకుని మీసం కరెక్ట్ గా షేవ్ చేయించుకుని రావాలని సూచించారు. కానీ రాణా వినలేదు.

దీంతో రాణాపై ఏఐజీ ప్రశాంత్‌ శర్మ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్భంగా ఏఐజీ ప్రశాంత్ మాట్లాడుతూ..యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తీ అయినా సరే సరైన రీతిలో ఉండాలని..ఇటువంటి వేషధారణతో డ్యూటీకి రాకూడదని స్పష్టం చేశారు. పైగా రాణా పోలీస్ యూనిఫాం వేసుకోకుండా డ్యూటీకి వచ్చాడని తెలిపారు.

తనను సస్పెండ్ చేయటంపై స్పందించిన కానిస్టేబుల్‌ రాణా మాట్లాడుతూ..నన్ను సస్పెండ్ చేసినా సరే పెంచిన నా మీసాలను తగ్గించేది లేదని స్పష్టంగా చెప్పాడు. నేను రాజ్‌పుత్‌ని..మీసం తీయటం అనేది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఏది ఏమైనా సరే మీసం తీసేది లేదని స్పష్టంచేశాడు రాణా.అధికారులు చెప్పినట్లుగా తాను ఎప్పుడూ యూనిఫాం లేకుండా డ్యూటీకి రాలేదని ఇది కావాలని తనపై చేసిందేనని తెలిపాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents