నిజాయితినిచాటిన ఆటోడ్రైవర్ ను అభినందించిన ట్రాఫిక్ పోలీసులు
గోదావరిఖని గణేష్ నగర్ కి చెందిన నాంపల్లి సతీష్ దంపతులు వారి పిల్లల తో కలసి హైదరాబాద్ కి వెళ్లడం కొరకు ఆటోలో గోదావరిఖని బస్టాండ్ కి వచ్చి తొందరగా వెళ్లాలనే క్రమంలో వారి లగేజీ ని ఆటో లొనే మరచిపోయారు. బస్సు ఎక్కిన తర్వాత లగేజీ ఆటోలోనే మరిచిపోయిన విషయం గమనించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కి ఆటో లో బ్యాగ్ మరచిపోయామని అందులో విలువైన సెల్ ఫోన్ కూడా ఉందని తెలియజేశారు. ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి ఏఎస్సై వెంకటేశ్వర్లు ను పంపించగా అదే సమయంలో ఆటో డ్రైవర్ లావుడ్య రమేష్ ఏఎస్సై దగ్గరకు వచ్చి తన ఆటలో ప్రయాణికులు బ్యాగ్ మరచిపోయరని తెలిపాడు. ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ కీర్తి వెంకటేష్, ఆటో డ్రైవర్ లావుడ్య రమేష్ లు సంబంధిత ప్రయాణికులకు బ్యాగ్ అందచేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మరిచిపోయిన బ్యాగ్ ని వారికి అందజేయడంలో కృషి చేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ కీర్తి వెంకటేష్, ఆటో డ్రైవర్ లావుడ్య రమేష్ లను ఇన్స్పెక్టర్ అభినందించారు.