రుణాల మంజూరులో బ్యాంకర్ల సహకరించాలి: మేయర్

0 8

పిఎం స్వనిధిలో భాగంగా మొదటి విడత పది వేల రూపాయల ఋణం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన లబ్దిదారులకు ఎలాంటి పూచికత్తు లేకుండా రెండవ విడత రుణం కూడా మంజూరు చేసి సహకరించాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ బ్యాంకు అధికారులను కోరారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, టౌన్ వెండింగ్ కమిటీ సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని రెండవ విడత రుణం కూడా మంజూరయ్యేలా చూడాలని మేయర్లకు ఇటీవల వారణాశిలో నిర్వహించిన అఖిల భారత మేయర్ల సమావేశంలో ప్రధాని ఆదేశాలు జారీ చేసారని అన్నారు. తీసుకున్న రుణాన్ని లబ్దిదారుల నుండి తిరిగి వసూలు చేయడంలో మెప్మా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని అన్నారు. వీధి వ్యాపారులకు పిఎం స్వ నిధి రుణాలు మంజూరు చేయడంలో రామగుండం నగరం దేశంలోనే ప్రదమైన స్థానంలో ఉండడంలో స్థానిక బ్యాంకు అధికారుల సహకారం వుందని అన్నారు.

రుణాల మంజూరులో బ్యాంకర్ల సహకరించాలి: మేయర్

ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమీషనర్ బి. సుమన్ రావు, ట్రాఫిక్ సి ఐ ప్రవీణ్ కుమార్, మెప్మా పిడి అర్బన్ రజనీ, టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ శ్వేత, బ్యాంకు అధికారులు జ్యోతి, శ్రీనివాస్, ఆర్ఎం రావు, సతీష్, మహేష్, విష్ణు, మాధురి, కమ్యూనిటీ అర్గనైజర్లు ఊర్మిళ, స్వరూప, ప్రియ దర్శిని, శమంత, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents