ఆల్ ఫోర్స్ విద్యార్థులకు బంగారు పతకాలు
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని, అందులో పాల్గొనేలా ప్రోత్సాహకాలను అందించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ పట్టణం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సూల్ అఫ్ జెన్ నెక్స్ట్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించడంపట్ల ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని ప్రత్యేకంగా విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. క్రీడల్లో లభించే లాభాలు మరే ఇతర అంశాల్లో సాధ్యం కాదని చెప్పారు. విద్యార్థులకు పోటీతత్వంతో పాటు సత్సంబంధాలు ఏర్పరిచే విధంగా ఉంటాయని తెలుపుతూ ప్రతి విద్యార్థి క్రీడా రంగాల్లో పాల్గొని వాటిలోని విషయాలను సముచితంగా తెలుసుకొని ఉత్తమంగా ఉండాలని వారు సూచించారు.
క్రీడల ద్వారా కలిగే విశిష్ఠ లాభాలవలన పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులను వివిధ పోటలకు ఎంపిక చేయడమే కాకుండా అందులో విజయాన్ని సునాయాసంగా అందుకోవడానికై ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభను కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో హన్మకొండలో క్రియేటివ్ కరాటే డు సంస్థవారు నిర్వహించినటువంటి 30 వ అంతరాష్ట్రయ ఓపెన్ చాంపియన్షిప్లో పాఠశాలకు చెందినటువంటి కె. పావని , 9 వ తరగతి , బ్లాక్ బెల్ట్ విభాగంలో కరాటే మరియు కుమెటోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా 2 భంగారు పతాకలను , 2 ప్రశంస పత్రాలను కైవసం చేసుకొని మొదటి స్థానాన్ని గెలుచుకోవడం చాలా గర్వించదగ్గ విషయమని వారు చెప్పారు. ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకోవడంపట్ల సంతోషాన్ని వ్యకత్తం చేస్తు విజేతకు పుష్పగుచ్ఛంతో పాటు ప్రశంస పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.