దేవాలయాలను బంద్ చేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేయలేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేస్తూ దేవాలయాల్లో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అన్నారు.ఆలయాల్లో దర్శనాల బందుపై దేవదాయ శాఖ ఏలాంటి సర్క్యులర్ జారీ చేయలేదు. ముక్కోటి ఏకాదశి సందర్భగా ప్రసిద్ధ ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.