మాకేవి విద్యాలయాలు..? మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్న

0 18

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున్నాను.. తెలంగాణకు విద్యాలయాలు కేటాయించి, తప్పును సరిదిద్దుకోవాలని మోదీకి కేటీఆర్ సూచించారు. తెలంగాణకు విద్యా సంస్థలు కేటాయించాలని అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ.. ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క విద్యాలయాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేయలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.

మాకేవి విద్యాలయాలు..? మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్న

Also Read :

నృత్య కారిణిని అవార్డ్

తమిళనాడులో ఒకే రోజు 11 వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని చేసిన ట్వీట్‌పై కేటీఆర్ పైవిధంగా స్పందించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విద్యాలయాలు, వైద్యకళాశాలలను మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిందని కేటీఆర్‌ ఆక్షేపించారు. గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నా మంజూరు చేయలేదన్నారు. ఏడు సంవత్సరాల్లో కేంద్రం ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసిన విద్యాసంస్థల వివరాలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Hon’ble PM @narendramodi Ji

On this #NationalYouthDay on behalf of Telangana youth & students, request you to make amends at the earliest

In the last 7 years, not even one educational institution has been sanctioned by NDA Govt to Telangana despite many requests at all levels https://t.co/8N1QPHodbQ pic.twitter.com/6MPVdQKaOF

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents