సింగరేణి డైరెక్టర్ (పా) ను కలసిన ఎమ్మెల్యే
రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) బలరామ్ నాయక్ ను బుధవారం హైదరాబాదులో కలిశారు. డైరక్టర్ పా కు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి క్యాలెండర్ ను అందించారు. సింగరేణి గని కార్మికులకు సింగరేణి సంస్థ రూపొందించిన క్యాలెండర్ ను అందించాలని అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ లో గృహాలపై నుండి వెళ్తున్న సింగరేణి సంస్ద విద్యుత్ లైన్ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని విద్యుత్ లైన్ ను తోలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్, నాయకులు జేవి రాజు, కోట రవి, మంథని సంపత్ ఉన్నారు.