వైకుంఠ ఏకాదశి సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో గల శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీతో నిండి పోయింది. ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పుష్పాలంకరణతో అందంగా తయారు చేసినారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ నామాలతో ప్రతిధ్వనించాయి.