రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

0 4

జగిత్యాల జిల్లాలో ప్రతి మండలంలోని ప్రజల రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులు సత్వర చర్యలు చేపట్టి వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులుపై రెవెన్యూశాఖ అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. చౌకధరణ దుకాణాలపై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, అక్రమరవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డులను అంద చేయాలని, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సం. లు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు మాదురి, వినోద్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఏఓ, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents