రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. ఎగబడ్డ వాహనదారులు

0 8

హైదరాబాద్ మాదాపూర్‌లో నకీలీ రెండు వేల నోట్లు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం కాకతీయహిల్స్‌ కమాన్‌ సమీపంలో రోడ్డుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని ఫేక్ రెండు వేల కరెన్సీ నోట్లను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి తీసుకునేందుకు పోటీపడ్డారు. తీరా వాటిని పరిశీలిస్తే, అవి ఫేక్ కాగితాలుగా తేలడంతో అంతా ఉసూరుమన్నారు. కాగా ఈ నోట్లను నిజమైనవిగా భావించి వాటిని దక్కించికునేందుకు.. స్థానికులు, వాహనదారులు పోటీపడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా పిల్లలు ఆడుకునేందుకు ఆ నోట్స్ వినియోగిస్తున్నారని విచారణలో తేలింది. పండక్కి తమ పంట పండింది. అనుకుని ఆ నోట్లను ఎత్తుకున్నవారందరూ అసలు విషయం తెలిసి వాటిని అక్కడే పడేసి నిరాశతో ఇళ్ల బాట పట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లో నకీలీ రెండు వేల నోట్లు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం కాకతీయహిల్స్‌ కమాన్‌ సమీపంలో రోడ్డుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని ఫేక్ రెండు వేల కరెన్సీ నోట్లను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి తీసుకునేందుకు పోటీపడ్డారు. తీరా వాటిని పరిశీలిస్తే, అవి ఫేక్ కాగితాలుగా తేలడంతో అంతా ఉసూరుమన్నారు. కాగా ఈ నోట్లను నిజమైనవిగా భావించి వాటిని దక్కించికునేందుకు.. స్థానికులు, వాహనదారులు పోటీపడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా పిల్లలు ఆడుకునేందుకు ఆ నోట్స్ వినియోగిస్తున్నారని విచారణలో తేలింది. పండక్కి తమ పంట పండింది. అనుకుని ఆ నోట్లను ఎత్తుకున్నవారందరూ అసలు విషయం తెలిసి వాటిని అక్కడే పడేసి నిరాశతో ఇళ్ల బాట పట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents