పండగ వేళా స్వగ్రామానికి వెళ్తూ.. ఇంతలో

0 4

పండగ వేళా స్వగ్రామానికి వెళ్తూ బైక్ అదుపు తప్పి భార్యాభర్తలకు, పాపకు తీవ్ర గాయాలపాలయి న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన జంజీ కృష్ణ (32), అతని భార్య శ్రుతి (30), కూతురు సాక్షి శ్రీ (3) లతో కలిసి బైక్ పై సంక్రాతి పండుగకు స్వంత గ్రామమైన కరీంనగర్ జిల్లా మొగలి పాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై పయనం కాగా తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్దకు రాగానే.. వారి బైక్ టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో వాహనం పై ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కృష్ణకు ఎడమ చేతి విరగగా, అతని భార్య శృతికి, పాప తలకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్, పైలెట్ శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వారికి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

పండగ వేళా స్వగ్రామానికి వెళ్తూ.. ఇంతలో

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents