వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఈటల
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మడలంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంట పొలాలను గురువారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజులుగా అకాల వర్షాలు పడి రాష్ట్రంలో పలు చోట్ల చేతికి వచ్చిన మిర్చి పంట నష్టపోయిందని అన్నారు. మంచి పంట వచ్చింది అప్పులు తీరుతాయని సంతోషంగా ఉన్న రైతులు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు.