రైతు బాంధవుడు కేసిఆర్: ఎమ్మెల్యే దాసరి
దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వెలుగోడు మండల కేంద్రంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హాజరై ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి- మోహన్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక రాజా నర్సు, పీఏసీఎస్ ఛైర్మెన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డి, కేడిసీసీబీ మాజీ డైరెక్టర్ మహేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ ప్రసాద్ రావు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాడ కొండల్ రెడ్డి, సర్పంచ్ లు బూర్ల సింధుజ, గోపు విజేందర్ రెడ్డి, పెద్దోళ్ల ఐలయ్య, గొల్లే కావేరి, దేవరనేని ప్రభావతి, తంగెళ్ళ స్వప్న, ఎంపీటీసీలు తూడి లక్ష్మి, నారగోని ఎళ్లవ్వ, కొత్తిరెడ్డి ప్రేమలత, కో ఆప్షన్ ఖలీల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గణపతి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షులు శరత్ రెడ్డి, సుధాకర్ రావు, కొమురయ్య, నరింగ్గం ఉప సర్పంచ్ లు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.