జైలు గదిలో ఖైదీతో మహిళా జడ్జి ముద్దు ముచ్చట్లు !
ఓ జైలు గది. అందులో ఓ మహిళ, ఖైదీ ముద్దులాడుకుంటున్నారు. కొంత విరామం తర్వాత కలుసుకున్న ప్రేమికుల్లాగా మూతి ముద్దులు కూడా పెట్టుకున్నారు. కాసేపు ఆ రొమాన్స్ సాగింది.” ఇంతలో ఆ వీడియో అయిపోయింది. ఇది సినిమాలో సీన్ కాదు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం. ఇప్పుడీ దృశ్యం ఆ దేశంలో సంచనలం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆ జైల్లో ఉన్న ఖైదీ పోలీసును హత్య చేసిన హంతకుడు. ఆతడితో రొమాన్స్ చేస్తున్న మహిళ .. ఓ న్యాయమూర్తి. ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందో తెలియక జైలు అధికారులు కిందా మీదా పడుతున్నారు. కానీ ఆ వీడియోను మాత్రం వాళ్లతో సహా అందరూ పదే పదే చూస్తున్నారు.
అర్జెంటీనాలో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ బస్టోస్ జైలులో ఉన్నారు. 2009లో పోలీస్ అధికారి లియాండ్రో ‘టిటో’ రాబర్ట్స్ని బస్టోస్ హత్య చేశాడు. అతను చేసిన నేరం నిరూపణ అయింది. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్ లో మారియల్ అనే న్యాయమూర్తి కూడా ఉన్నారు. విచారణ సమయంలో బస్టోస్కు యావజ్జీవ శిక్ష వేయవద్దని ఆమె ఓటు వేశారు. కానీ మిగిలిన వాళ్లంతా యావజ్జీవ శిక్ష వేయాల్సిందేనని తేల్చడంతో బస్టోస్కు జీవితాతం జైల్లో ఉండే శిక్ష పడింది.
ఆ తరవాత మారియల్ జైలుకు వెళ్లి బస్టోజ్తో ములాఖత్ అయింది. ఈ ములాఖత్లోకి ముద్దులు కూడావచ్చాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని అక్కడి సుప్రీంకోర్టు తెలిపింది. అంతకు ముందు వీరికి పరిచయం ఉందా.. లేకపోతే విచారణ సమయంలోనే మహిళా న్యాయమూర్తి హంతకుడి పట్ల ఆకర్షితురాలయిందా అన్నదానిపై ఇప్పటికైతే పరిశోధన జరుగుతోంది. కానీ వారి లవ్ స్టోరీ మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
VIDEO DOCUMENTO.
AMIGOS ARGENTINA TOCO FONDO.
JUEZA QUE INTEGRO TRIBUNAL QUE CONDENO A PERPETUA AL ASESINO DE UN POLICIA EN CHUBUT, FUE HACERLE MATE Y MIMOS A LA PRISION AL CONDENADO. FUE SUMARIADA.
LA JUEZA SE LLAMA, MARIEL ALEJANDRA SUAREZ. pic.twitter.com/Gf07UEIA1H
— MARCELO FAVA (@MARCELOFAVAOK) January 4, 2022