జగిత్యాలలో దారుణం : తెరాస నేత దారుణ హత్య.. కారణం అదేనా..?
ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య చెదలు రాజేందర్ అనే వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంది. గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమిని రాజేందర్ చదును చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతడిని అతి క్రూరంగా హత్య చేసినట్టు సమాచారం. అయితే, ఈ హత్యకు కొంత కాలంగా సాగుతున్న భూ తగాదాలే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ దారుణ హత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య చెదలు రాజేందర్ అనే వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంది. గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమిని రాజేందర్ చదును చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతడిని అతి క్రూరంగా హత్య చేసినట్టు సమాచారం. అయితే, ఈ హత్యకు కొంత కాలంగా సాగుతున్న భూ తగాదాలే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ దారుణ హత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
