బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఆరు బోగీలు
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలుప్రమాదం సంభవించింది. బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు డొమోహని వద్ద అదుపుతప్పింది.
రైలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకున్నారు. దీంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు.
స్థానికుల సహయంతో క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఐదుగంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా, రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. .. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో మాట్లాడారు. రైలు ప్రమాదంపై మమత విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి ఒక లక్ష చొప్పున తక్షణ సహయంగా రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందించారు. శుక్రవారం ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు.